Supreme Court: అయోధ్య కేసులో రోజువారీ విచారణ సమయాన్ని పెంచిన సుప్రీం కోర్టు
- సుప్రీంలో అయోధ్య వివాదంపై విచారణ
- సాయంత్రం 5 గంటలకు వాదనలు వింటామన్న ధర్మాసనం
- అక్టోబరు 18 నాటికి విచారణ పూర్తి చేయాలని నిర్ణయం
ఎన్నో ఏళ్లుగా నలుగుతోన్న అయోధ్య వివాదంపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అయోధ్య కేసులో ఇరుపక్షాల వాదనలు వినడం అక్టోబరు 18 లోగా పూర్తిచేయాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో, ప్రతిరోజు ఓ గంట సమయం అదనంగా విచారణ జరపాలని నిర్ణయించామని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాయంత్రం 4 గంటలకే పూర్తవుతుంది. అయితే, ఓ గంట పెంచుతూ సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు బెంచ్ స్పష్టం చేసింది.