Visa: ఈ దేశాలకు మనం వీసా లేకుండానే వెళ్లి రావొచ్చు!
- భారతీయులకు సులభ ప్రవేశం కల్పిస్తున్న కొన్ని దేశాలు
- వీసా అక్కర్లేని విధానం
- పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఆంక్షల సడలింపు
కొన్ని దేశాలు తమ గడ్డపై విదేశీయుల రాక పట్ల అనేక కఠిన ఆంక్షలు విధిస్తుంటాయి. వాటిలో వీసా ఒకటి. అన్ని రకాల అర్హతలు, సరైన పత్రాలు, భాషా నైపుణ్యం లేకుండా వీసా పొందడం అంత తేలికేమీ కాదు. అయితే, కొన్ని దేశాల్లో భారతీయులు అడుగుపెట్టేందుకు వీసాలు అవసరంలేదు. ఆయా దేశాలు పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సహించే క్రమంలో వీసా రహిత విధానాన్ని అమలు చేస్తుంటాయి. వీటిలో చాలా దేశాలు ఎయిర్ పోర్టుల్లోనే ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేస్తాయి. ఈ పత్రాలు వెంటే ఉంటే నిర్ణీత కాలవ్యవధి వరకు హాయిగా పర్యటించవచ్చు.
భారతీయులు వెళ్లేందుకు వీసాతో పనిలేని దేశాలు ఇవే...
- ఫిజి
- సెయింట్ లూసియా
- డొమినికా
- సీషెల్స్
- నేపాల్
- మాల్దీవులు
- సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
- ట్రినిడాడ్ అండ్ టొబాగో
- థాయిలాండ్
- టాంజానియా
- సమోవా
- మారిషస్
- మడగాస్కర్
- మకావు
- లావోస్
- కెన్యా
- జోర్డాన్
- జమైకా
- ఇండోనేషియా
- హాంకాంగ్
- గ్రెనడా
- ఈక్వెడార్
- ఎల్ సాల్వడార్
- ఉగాండా
- కుక్ ఐలాండ్స్
- కేప్ వెర్డె
- కాంబోడియా
- బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్
- బొలీవియా
- భూటాన్