East Godavari District: చేతులెత్తేసిన అధికారులు.. బోటు వెలికితీత చర్యలు నిలిపివేత

  • వెనుదిరిగిన నేవీ, సహాయక బృందాలు
  • కాకినాడ, ముంబై నుంచి నిపుణులను తెప్పించినప్పటికీ ఫలితం శూన్యం
  • కచ్చలూరులో 144 సెక్షన్

తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిన బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆ చర్యలు నిలిపివేశారు. కాకినాడ, ముంబైల నుంచి నిపుణులను తెప్పించినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న నేవీ, ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు, ఇతర బృందాలు కూడా ఘటనా స్థలం నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటి వరకు 35 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదం జరిగిన కచ్చలూరు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.  

  • Loading...

More Telugu News