polavaram: నాలుగు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది!: ప్రత్తిపాటి పుల్లారావు

  • కాంట్రాక్టర్లను మార్చితే ప్రాజెక్టుల భద్రత ఎవరు చూస్తారు?
  • ప్రభుత్వానికి ఆదా అంటూ కాంట్రాక్టర్లకు ప్రయోజనం
  • ‘పోలవరం’ పూర్తయ్యే నాటికి ప్రజలపై అదనపు భారం పడుతుంది

నాలుగు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ విధానంతో కాంట్రాక్టర్లను మార్చితే ప్రాజెక్టుల భద్రత ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఆదా చేస్తున్నామని చెబుతూ కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ప్రజలపై అదనపు భారం పడుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News