Narendra Modi: భారత్లో జరిగే ఎన్బీఏ పోటీలకు నేను రావొచ్చు.. జాగ్రత్త: మోదీతో ట్రంప్
- వచ్చే నెల 4-5 తేదీల్లోముంబైలో ఎన్బీఏ పోటీలు
- తొలిసారి ఆతిథ్యమిస్తున్న భారత్
- తాను వచ్చే అవకాశం ఉందన్న అమెరికా అధ్యక్షుడు
ఉత్తర అమెరికాకు చెందిన జాతీయ బాస్కెట్బాల్ అసోసియేషన్ నిర్వహించే పోటీల్లో భాగంగా వచ్చే నెల 4,5 తేదీల్లో ముంబైలో సక్రామెంటో కింగ్స్ - ఇండియానా పేసర్స్ జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీలను మూడువేల మంది విద్యార్థులు తిలకించనున్నారు.
ఈ పోటీలను వీక్షించేందుకు తాను భారత్ వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్త అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత కాలమానం ప్రకారం గతరాత్రి హ్యూస్టన్లో జరిగిన ‘హౌడీ-మోదీ’ సభకు హాజరైన ట్రంప్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్లో మొట్టమొదటిసారి ఎన్బీఏ బాస్కెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ (మోదీని ఉద్దేశించి) మీరు నన్ను ఆహ్వానిస్తారా? నేను రావొచ్చు.. జాగ్రత్త’’ అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.