polavaram: కేంద్రానికి డబ్బు మిగులుతుంటే ఆ ఏడుపెందుకు?: బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి
- ప్రాజెక్టుల సొమ్ము రాబందుల్లా బొక్కేశారు
- ఇప్పుడు డబ్బు మిగిలితే ఎందుకు నచ్చుతుంది
- ఐదేళ్లు దోచుకున్నది చాలదనా
పోలవరం రివర్స్ టెండర్స్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి భారీగా డబ్బు మిగులుతుంటే కొందరు నాయకులకు ఏడుపెందుకని బీజేపీ నాయకుడు విష్ణువర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్స్ పిలవడంతో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ దీన్ని 12.6 శాతం తక్కువ మొత్తానికి దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వానికి 628 కోట్ల రూపాయలు మిగిలాయి.
దీనిపై విపక్ష టీడీపీ నాయకులు పలురకాల విమర్శలు చేస్తుండడంతో విష్ణువర్థన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐదేళ్లపాటు ఏటీఎం, పేటీఎంల్లా రాష్ట్రాన్ని దోచేసిన వారికి ఇటువంటి చర్యలు ఎందుకు మింగుడుపడతాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును రాబందుల్లా బొక్కేశారని, ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఏడుపు అందుకుంటున్నారని విమర్శించారు.