Imran Khan: కశ్మీర్ పై అన్ని ప్రయత్నాలు చేశాం.. ఇక చేయడానికి ఏమీ లేదు: ఇమ్రాన్ ఖాన్ నిరాశ

  • కశ్మీర్ విషయంలో యుద్ధం తప్ప అన్నీ చేశాం
  • ప్రపంచ దేశాల నుంచి మాకు మద్దతు లభించడం లేదు
  • ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ కు ఇతర దేశాలు సహకరించడం లేదు

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత... అంతర్జాతీయ వేదికలపై భారత్ ను ఎండగట్టాలని యత్నించిన పాకిస్థాన్ కు చేదు అనుభవమే మిగిలింది. చైనా మినహా పాకిస్థాన్ కు ఏ దేశం నుంచి కూడా మద్దతు లభించలేదు. పాక్ గగ్గోలును ఐక్యరాజ్యసమితి కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిజాన్ని ఒప్పుకున్నారు.

ఐక్యరాజ్యసమితిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమకు ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని చెప్పారు. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని... ఇతర దేశాలు పాకిస్థాన్ కు మద్దతును ఇవ్వడం లేదని అన్నారు. కశ్మీర్ విషయంలో యుద్ధం తప్ప అన్నీ చేశామని... ఇక చేయడానికి ఏమీ లేదని నిరాశను వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News