Adharwa: 'గద్దలకొండ గణేశ్'తో హీరో అధర్వకి పెరిగిన క్రేజ్

  • 'గద్దలకొండ గణేశ్'తో అధర్వ పరిచయం 
  • తెలుగు ప్రేక్షకుల నుంచి లభిస్తోన్న ఆదరణ 
  • అధర్వ సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి

హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఇటీవల థియేటర్స్ కి వచ్చిన 'గద్దలకొండ గణేశ్' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. వరుణ్ తేజ్ తో పాటు తమిళ హీరో అధర్వ మురళి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఆయనకి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ నేపథ్యంలో తమిళంలో ఆయన చేసిన హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేయడానికి కొంతమంది నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారట. ఈ ఏడాది మార్చిలో తమిళంలో హిట్ కొట్టిన 'బూమరాంగ్' సినిమాను తెలుగులోకి డబ్ చేసే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలైపోయాయట. అక్టోబర్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఇక్కడి మార్కెట్ ను పెంచుకోవడంలో అధర్వ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

  • Loading...

More Telugu News