Vijayawada: ఏపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోంది: బోండా ఉమ
- అన్యమత ప్రచారాన్ని ఖండిస్తున్నా
- వైసీపీ ప్రభుత్వ పోకడలను సహించం
- వెంటనే చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తాం
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని ఖండిస్తూ హిందూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల సహా ఇతర హిందూ దేవాలయాలు ఉన్న చోట అన్యమత ప్రచారం ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పోకడలను సహించేది లేదని, వెంటనే చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందువుల సంక్షేమానికి మాత్రమే ఖర్చు పెట్టాలని, అర్చకుల జీతాలు పెంచాలని, పవిత్ర సంగమంలో కృష్ణవేణి హారతులను పునరుద్ధరించాలని కోరారు.