Tik Tok: టిక్ టాక్ లో చేరిన తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం రికార్డు
- టిక్ టాక్ లో ఖాతా తెరిచిన ఎంఐఎం
- రాజకీయపరమైన సరదా వీడియోలను రూపొందించి టిక్ టాక్ లో అప్ లోడ్
- ఇప్పటికే 7 వేలకు పైగా ఫాలోయర్లు
అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను పూర్తిగా వినియోగించుకుంటూ... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ కార్యకలాపాలను వివరించడం దగ్గర నుంచి... ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో విరుచుకుపడేంత వరకు... అన్ని పార్టీలు సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నాయి.
మరోవైపు హైదరాబాద్ కు చెందిన రాజకీయ పార్టీ ఎంఐఎం మరో ముందడుగు వేసింది. ఇంతకాలం టైమ్ పాస్ వీడియోలకే పరిమితమైన టిక్ టాక్ లో కూడా ఖాతాను తెరిచింది. తద్వారా టిక్ టాక్ లో ఖాతా తెరిచిన తొలి పార్టీగా ప్రత్యేకతను సాధించింది. పార్టీ పరంగా సరదా వీడియోలను రూపొందించి అప్ లోడ్ చేసేందుకు టిక్ టాక్ ను వేదికగా మలుచుకుంది. ఇప్పటికే టిక్ టాక్ లో ఎంఐఎంకు 7 వేలకు పైగా ఫాలోయర్లు చేరిపోయారు.