Ex-minister: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సత్యారావు దుర్మరణం!
- విశాఖలో జరిగిన ఘటన
- వాకింగ్ చేస్తుండగా ఆయన్ని ఢీ కొట్టిన వాహనం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు దుర్మరణం చెందారు. స్థానిక బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఓ వాహనం ఆయన్ని ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సత్యారావును బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన మృతి చెందారు.