Kasturi Shivarao: నాటి స్టార్ కమెడియన్ మళ్లీ మొదటికి రావడానికి అదే కారణమట!
- 'వర విక్రయం'తో శివరావు పరిచయం
- 'గుణసుందరి కథ' కోసం లక్ష పారితోషికం
- భజనపరుల వలన నష్టపోయాడన్న ఈశ్వర్
తెలుగు తెరపై సందడి చేసిన తొలితరం హాస్యనటుల జాబితాలో కస్తూరి శివరావు ముందువరుసలో కనిపిస్తారు. రచయిత .. సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, శివరావు గురించిన విషయాలను పంచుకున్నారు. "కస్తూరి శివరావు 'వర విక్రయం' అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన చాలా చిన్న వేషం వేశారు. ఆ తరువాత కూడా వేషాల కోసం సైకిల్ పై పాండీ బజార్లో తిరిగేవారు.
చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 'గుణసుందరి కథ' సినిమా కోసం లక్ష రూపాయల పారితోషికం అందుకున్నారు. ఆ సినిమా హిట్ కావడంతో ఆయన దశ తిరిగిపోయింది. స్టార్ కమెడియన్ గా ఎదిగిపోయిన ఆయన, పాండీ బజార్లో ఖరీదైన కార్లో తిరిగేవారు. అయితే కొంతమంది భజనపరులు ఆయన చుట్టూ చేరి తాగుడికి బానిసను చేశారు .. ఆయనతో సొంత సినిమాలు తీయించారు. ఈ కారణంగా ఆస్తులు పోగొట్టుకున్న ఆయన, అదే పాండీబజార్లో మళ్లీ పాత సైకిల్ పై తిరగాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.