Uttarakhand: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారట.. 40 మంది ఉత్తరాఖండ్ నేతలపై బీజేపీ వేటు
- వచ్చే నెల 6 నుంచి 16 వరకు ఉత్తరాఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు
- పార్టీ బరిలో నిలిపిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు
- పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై 40 మంది బీజేపీ నాయకులపై ఆరేళ్లపాటు అధిష్ఠానం వేటేసింది. అక్టోబరు 6 నుంచి 16వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 40 మంది బీజేపీ నాయకులు.. పార్టీ బరిలో నిలిపిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం ఆ 40 మందిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు అజయ్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర భండారీ తెలిపారు.