Jammu And Kashmir: జమ్మూలో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర... భగ్నం చేసిన భద్రతా బలగాలు
- జమ్మూ బస్టాండ్ వద్ద భారీగా ఆర్డీఎక్స్ స్వాధీనం
- భద్రతా బలగాల అదుపులో బస్సు డ్రైవర్, కండక్టర్
- ఓ జంట తమకు ఆర్డీఎక్స్ బ్యాగు అందించిందని వెల్లడించిన డ్రైవర్
కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న జమ్మూకశ్మీర్ లో నెత్తుటేర్లు పారించేందుకు ఉగ్రవాదులు మరోసారి కుట్రకు పాల్పడ్డారు. అయితే భద్రతా బలగాల అప్రమత్తతతో పెనుముప్పు తప్పింది. జమ్ము బస్టాండ్ వద్ద ఓ బస్సులో భారీగా ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బస్సు కథువా జిల్లా బిలావర్ నుంచి జమ్మూ వస్తోంది. బస్సు డ్రైవర్, కండక్టర్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. బిలావర్ లో ఓ జంట ఆర్డీఎక్స్ ఉన్న బ్యాగును అందించినట్టు డ్రైవర్ వెల్లడించాడు.