Andhra Pradesh: రూ. 3.41 లక్షల కోట్లకు చేరనున్న ఏపీ అప్పులు: రిజర్వ్ బ్యాంక్

  • 2020 మార్చి నాటికి రూ. 3.41 లక్షల కోట్లకు చేరనున్న ఏపీ అప్పులు
  • రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గణాంకాలను విడుదల చేసిన ఆర్బీఐ
  • ఏటా రూ. 17 వేల కోట్ల అప్పులను చెల్లించాల్సి ఉన్న ఏపీ

2020 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు రూ. 3.41 లక్షల కోట్లకు చేరుకోబోతున్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై నిన్న ఆర్బీఐ గణాంకాలను విడుదల చేసింది.

ప్రతి ఏటా సగటున రూ. 17 వేల కోట్ల పైచిలుకు చొప్పున... రానున్న ఐదేళ్లలో రూ. 89,994 కోట్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News