Telangana: సమ్మెకు దిగే టీఎస్సార్టీసీ కార్మికులపై కఠిన చర్యలు?
- సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్ చేస్తాం
- ఈ మేరకు నోటీస్ బోర్డులో హెచ్చరించాలి
- ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ
ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ ల కమిటీ జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు నివ్వడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సమ్మెకు దిగే ఆర్టీసీ కార్మికులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్ చేస్తామని, ఈ మేరకు నోటీస్ బోర్డులో హెచ్చరించాలని అధికారులకు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. కార్మికులు సమ్మెకు దిగితే అద్దె బస్సులు, స్కూల్ బస్సులు తెచ్చి నడుపుతామని అన్నారు.
కాగా, దూర ప్రాంతాలకు వెళ్లే పలు బస్సులను కార్మికులు ఆపేశారు. ఈరోజు అర్ధరాత్రికి గమ్యస్థానాలకు చేరుకునే బస్సులను మాత్రమే కార్మికులు పంపుతున్నారు. అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయి సమ్మెకు దిగుతామని కార్మికులు చెబుతున్నారు.