Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య కుదిరిన పొత్తు... కూటమికి 'మహాయుతి'గా నామకరణం
- మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు
- బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తొలగిపోయాయన్న ఫడ్నవీస్
- కూటమిదే విజయం అని ధీమా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ, శివసేన మధ్య పొత్తు ఖరారైంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 150 స్థానాల్లో బీజేపీ, 124 స్థానాల్లో శివసేన, మిగిలిన స్థానాల్లో మిత్రపక్షాలు పోటీచేయడానికి ఒప్పందం కుదిరింది. ఇక, బీజేపీ-శివసేన కూటమికి 'మహాయుతి'గా నామకరణం చేశారు. బీజేపీ, శివసేన మధ్య విభేదాలు సమసిపోయాయని, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమి విజయం ఖాయమని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు.