Pakistan: పాకిస్థాన్‌లో ప్రధాని, అధ్యక్ష పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు: ఇమ్రాన్ ప్రభుత్వం స్పష్టీకరణ
- ముస్లిమేతరులు పదవులు అధిష్ఠించేలా రాజ్యంగ సవరణ బిల్లు
- అడ్డుకున్న ఇమ్రాన్ ప్రభుత్వం
- పాకిస్థాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశమని స్పష్టీకరణ
పాకిస్థాన్‌లో అధ్యక్ష, ప్రధాని పదవులు కేవలం ముస్లింలకు మాత్రమేనని ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ స్పష్టం చేసింది. ముస్లిమేతరులు వాటిని అధిష్ఠించడానికి అనర్హులని పేర్కొంది. ముస్లిమేతరులు కూడా ఈ పదవులను చేపట్టేందుకు వీలుగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన క్రిస్టియన్ ఎంపీ నవీద్ ఆమిర్ జీవా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతుండగా, ప్రభుత్వం దానిని అడ్డుకుంది.
ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అలీ మహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశమని పేర్కొన్నారు. ఇక్కడ దేశాధ్యక్షుడు, ప్రధాని పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు అవుతారని ఆయన స్పష్టం చేశారు.