India: 98 ఓవర్లు, 9 వికెట్లు... మధ్యలో వరుణుడు!

  • నేడు విశాఖలో వర్షం కురిసే అవకాశం
  • హెచ్చరించిన వాతావరణ శాఖ
  • దక్షిణాఫ్రికా టార్గెట్ 395 పరుగులు

విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఐదో రోజుకు చేరుకుంది. నేడు విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతుండగా, తొలి ఇన్నింగ్స్ నుంచి వచ్చిన స్ఫూర్తితో, రోజంతా నిలిచి, మ్యాచ్ ని డ్రా చేసుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. నేడు విశాఖలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆట సజావుగా సాగితే, మొత్తం 98 ఓవర్లు ఇండియా చేతుల్లో ఉంటాయి. దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే ఓ వికెట్ ను కోల్పోయింది. కీలకమైన ఎల్గర్ పెవీలియన్ దారి పట్టాడు మరో 9 వికెట్లను భారత బౌలర్లు తీయగలిగితే, తొలి టెస్టులో విజయం సొంతమవుతుంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే, 395 పరుగులు చేయాల్సి వుంటుంది. ఈ లక్ష్యం దాదాపు అసాధ్యమే కావడంతో, సౌతాఫ్రికా ఆటగాళ్లు డ్రా కోసమే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. నేడు ఆదివారం కావడంలో మ్యాచ్ చూసేందుకు అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు వస్తారని అంచనా.

  • Loading...

More Telugu News