TTD: ముగింపు దశకు చేరుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- మంగళవారం ఉదయం చక్రస్నానం
- బ్రహ్మోత్సవాల్లో ఆఖరిఘట్టం చక్రస్నానం
- ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. రేపు ఉదయం నిర్వహించే చక్రస్నానం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరిఘట్టమే చక్రస్నాన మహోత్సవం. మంగళవారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. ఆపై 6 గంటల నుంచి 9 గంటల వరకు స్వపన తిరుమంజనం ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు తిరుమాడవీధుల్లో శ్రీవారి ఊరేగింపు జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 9 మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా తెరపడనుంది.