Ravi Prakash: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను కస్టడీకి కోరిన బంజారాహిల్స్ పోలీసులు

  • చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న రవిప్రకాశ్
  • రవిప్రకాశ్ ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్
  • కాసేపట్లో పిటిషన్ ను విచారించనున్న నాంపల్లి కోర్టు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను విచారించేందుకు గాను తమ కస్టడీకి అప్పగించాలంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కాసేపట్లో నాంపల్లి కోర్టు విచారించనుంది. రూ. 18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై టీవీ9 యాజమాన్యం బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు... ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా... ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News