Andhra Pradesh: విద్యుత్ రంగంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: ఏపీ మంత్రి బుగ్గన ధ్వజం

  • చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో?
  • బాబు హయాంలో ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారు 
  • అందువల్ల ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నష్టం వాటిల్లింది

ఏపీలో విద్యుత్ రంగంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు.

 గత ప్రభుత్వమే డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయి పడిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంతో రూ.2,700 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని, టీడీపీ హయాంలో ఇరవై ఐదేళ్లకు హడావుడిగా పీపీఏలు చేసుకున్నారని విమర్శించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఫిబ్రవరిలో క్రిసిల్ ‘A+’ రేటింగ్ ఇచ్చింది అని, కేవలం జూన్ లో మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News