Hyderabad: హైదరాబాద్ లో మరోసారి కుంభవృష్టి
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- రహదారులపై నిలిచిన ట్రాఫిక్
- వాహనదారులకు ఇక్కట్లు
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యమైన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత నెల రోజులుగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. తాజాగా ఈ సాయంత్రం కూడా హైదరాబాద్ నగరాన్ని కుండపోత వాన అతలాకుతలం చేసింది. అమీర్ పేట, జూబ్లీహిల్స్, బేగంపేట, మియాపూర్, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్, మల్కాజ్ గిరి, కుషాయిగూడ, ఆల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది.