Nobel: నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ గురించిన విశేషాలు
- సతీ సమేతంగా పురస్కారం అందుకున్న అభిజిత్
- వీరితో పాటు మరో ఆర్థిక వేత్త మైఖేల్ క్రెమెర్ కు పురస్కారం
- పేదరికాన్నితగ్గించడానికి ప్రయోగాత్మక విధాన రూపకల్పనకు గాను నోబెల్ బహుమతి
ఆర్థిక శాస్త్రంలో 2019కి గాను నోబెల్ పురస్కారానికి ఎంపికైన ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ దేశానికి గర్వ కారణంగా నిలిచాడు. ఈ పురస్కారాన్ని అభిజిత్, ఆర్థిక వేత్త తన భార్య ఎస్తెర్ డఫ్లో, మరొక ఆర్థిక వేత్త మైఖేల్ క్రెమెర్ కలిసి సంయుక్తంగా అందుకుంటారు. ప్రపంచంలో పేదరికాన్ని తగ్గించడానికి వీరు
రూపొందించిన ప్రయోగాత్మక విధానానికి గాను ఈ పురస్కారం దక్కింది.
అభిజిత్ బెనర్జీకి సంబంధించిన వివరాలు:
- అభిజిత్ 1961లో ముంబైలో జన్మించారు.
- బెనర్జీ కలకత్తా విశ్వ విద్యాలయం, జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం, హార్వర్డ్ విశ్వ విద్యాలయాల్లో తన విద్యాభ్యాసాన్ని చేశారు. 1988 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పట్టాను అందుకున్నారు.
- ప్రస్తుతం అభిజిత్ బెనర్జీ మసాచుసెట్స్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భాగమైన ఫోర్డు ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లో అర్థ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్నారు.
- 2003లో అభిజిత్ అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ ఆక్షన్ ల్యాబ్( జె పాల్) ను స్థాపించారు.
- ఎకనమిక్స్ అనాలిసెస్ ఆప్ డెవలప్ మెంట్ లో భాగమైన బ్యూరో ఫర్ ద రీసెర్చ్ అధ్యక్షుడిగా ఉన్నారు.
- అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫెలో గా ఎన్నికయ్యారు.
- ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ హై లెవెల్ ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్ లో పోస్ట్-2015 డెవలప్ మెంట్ ఎజెండా రూపకల్పనలో పాలుపంచుకున్నారు.
- అభిజిత్ పలు పుస్తకాలు రాశారు. ఇందులో.. ‘ వాట్ ద ఎకనమీ నీడ్స్ నౌ’(2019), ‘ పూర్ ఎకనమిక్స్ ’ (2011), మేకింగ్ ఎయిడ్ వర్క్ (2007).