nasa: 'విక్ర‌మ్‌ ల్యాండర్'కు ఏం జ‌రిగిందో త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం: నాసా

  • చంద్రుడి ద‌క్షిణ ధ్రువానికి సంబంధించిన పలు చిత్రాల‌ను తీసిన ఎల్ఆర్వో
  • పరిశీలిస్తున్న నాసా
  • చంద్రుడి ఉప‌రిత‌లంపై పెరిగిన వెలుతురు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆ సంస్థకు చెందిన లూనార్ రిక‌న‌యిసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) చంద్రుడి ద‌క్షిణ ధ్రువానికి సంబంధించిన పలు చిత్రాల‌ను తీసింది. ప్రస్తుతం వీటిని ప‌రిశీలిస్తున్నామ‌ని, విక్రమ్ కు ఏం జరిగిందన్న వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎల్ఆర్వో ప్రాజెక్టు శాస్త్ర‌వేత్త నోహా పెట్రో వెల్లడించారు. మూడు రోజుల క్రితం చంద్రుడి ఉప‌రిత‌లంపై వెలుతురు పెరిగింద‌ని ఆయన చెప్పారు. గత నెల‌తో పోలిస్తే ద‌క్షిణ ధ్రువ ప్రాంతంలో నీడ త‌గ్గింద‌ని ఆయన వివరించారు.

గత నెల 17న కూడా ద‌క్షిణ ధ్రువం నుంచి ఎల్ఆర్‌వో వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, అక్క‌డ వెలుతురు లేని కార‌ణంగా విక్ర‌మ్ ఆచూకీ తెలియరాలేదు. కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ను గత నెల 7వ తేదీ తెల్లవారుజామున ఇస్రో దక్షిణ ధ్రువంపై దించే కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయపుటంచుల వరకు చేరుకొని చంద్రుడిపైకి అడుగుపెడుతుందన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ తెగింది.

  • Loading...

More Telugu News