Congress: మనీ లాండరింగ్ కేసులో చిదంబరంపై ఛార్జిషీట్ దాఖలు
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఛార్జిషీట్
- ఢిల్లీ కోర్టులో విచారణకు రంగం సిద్ధం
- చిదంబరం సహా 13 మందిని నిందితులు
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై దర్యాప్తు సంస్థలు పట్టు బిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. నిన్న చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తాజాగా సీబీఐ ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ సమర్పించింది.
ఈ కేసులో చిదంబరంతో పాటు మరో 13 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో ఐఎన్ ఎక్స్ మీడియా అధిపతులు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ ముఖర్జియా, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తదితరులున్నారు. ఈ కేసులో తొలుత చిదంబరంను ఆగస్ట్ 21న సీబీఐ అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలపై తీహార్ జైలుకు తరలించింది. అక్కడే ఆయనను విచారించింది. ఐఎన్ ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి నిధులు సమకూర్చడంలో చిదంబరం అధికార దుర్వినియోగం చేశారని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొంది.