Rajnath Singh: సరిహద్దుల్లో అప్రమత్తత ప్రకటించిన భారత సైన్యం... ఆర్మీ చీఫ్ తో మాట్లాడిన రాజ్ నాథ్

  • కాల్పుల ముసుగులో ఉగ్రవాదులను పంపేందుకు పాక్ యత్నం
  • దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం
  • 20 మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని భారత సైన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు జైసల్మేర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఉగ్రవాదులకు సహకరించే చర్యలకు దిగితే స్పందించే హక్కు తమకుంటుందని సైన్యం పేర్కొంది. అటు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తో తాజా పరిణామాలపై మాట్లాడారు. సరిహద్దుల వద్ద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు,భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ సైన్యం మరోసారి విఫలయత్నాలు చేయడం తెలిసిందే. భారత సైన్యం దృష్టి మళ్లించేందుకు పాక్ సైనికులు కాల్పులకు దిగారు. దాంతో భారత సైన్యం పాక్ పన్నాగాన్ని దీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో పాక్ సైన్యం, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లు ధ్వంసం కావడమే కాకుండా, 20 మంది వరకు పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భారత జవాన్లు కూడా వీరమరణం పొందినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News