Sensex: ఇన్ఫోసిస్ దెబ్బకు కుదేలైన మార్కెట్లు!
- ఇన్ఫోసిస్ కీలక అధికారులపై ఆరోపణలు
- 16 శాతానికి పైగా నష్టపోయిన ఇన్ఫీ షేర్లు
- 334 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
వరుసగా ఆరు రోజులు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ, సీఎఫ్ఓలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో... దాని షేర్లు ఈరోజు కుప్పకూలాయి. దీని ప్రభావంతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 38,963కు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 11,588కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.26%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.22%), సన్ ఫార్మా (1.10%), బజాజ్ (1.04%), యస్ బ్యాంక్ (0.97%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-16.66%), టాటా మోటార్స్ (-3.84%), భారతి ఎయిర్ టెల్ (-3.24%), హెచ్సీఎల్ (-2.91%), టెక్ మహీంద్రా (-2.31%).