nasa: 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిన ఓజోన్ రంధ్రం పరిమాణం: నాసా వెల్లడి
- ప్రతి ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో సాధారణ వాతావరణ పరిస్థితులు
- సాధారణంగా ఓజోన్ రంధ్రం 20 మిలియన్ చదరపు కి.మీ ఉంటుంది
- ఈ రంధ్రం పరిమాణం ఈ సారి మాత్రం సగానికి తగ్గింది
ప్రపంచం అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నప్పటికీ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం వెనుకబడే ఉంది. సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా చేసే ఓజోన్ పొర వాతావరణ కాలుష్యం కారణంగా పాడైపోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఈ ఏడాది తగ్గిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' శాస్త్రవేత్తలు చెప్పారు.
గత 40 ఏళ్లలో ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఎన్నడూ లేనంత అత్యల్పంగా ప్రస్తుతం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, రెండు నెలల్లో భూమిపై వాతావరణంలో వేడి ఉండడంతోనే ఓజోన్ పరిమాణం తగ్గిందని, అది పూర్తిగా కోలుకున్నట్లు భావించే పరిస్థితి లేదని వివరించారు.
ప్రతి ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో ఓజోన్ రంధ్రం దాదాపు 20 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రంధ్రం పరిమాణం ఈ సారి మాత్రం సగానికి (10 మిలియన్ చదరపు కి.మీ) తగ్గినట్లు చెప్పారు. ఉపగ్రహ డేటా ఆధారంగా నాసా, నోవా సంస్థలు ఈ విషయాన్ని తేల్చాయి.