Bithiri Sathi: ముకుంద రెడ్డి అనే వ్యక్తి నుంచి వచ్చినవాడే 'బిత్తిరి సత్తి': రవికుమార్
- ఎదుటివ్యక్తులను పరిశీలించేవాడిని
- అనుకరించడం మొదటి నుంచి అలవాటు
- 'ఆచారి'ని చూసేందుకు ఆటోలు కట్టుకొచ్చారన్న సత్తి
'బిత్తిరి సత్తి' అసలు పేరు రవికుమార్ అనే విషయం చాలామందికి తెలియదు. అలాంటి ఆయన తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనని తాను 'బిత్తిరి సత్తిగా' ఎలా మార్చుకున్నది ప్రస్తావించాడు.
"మొదటి నుంచి కూడా నేను ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ను .. మాట్లాడే తీరును గమనిస్తూ ఉండేవాడిని. అలా నేను మా ఊళ్లోని 'ఆచారి' అనే వ్యక్తిని చాలా దగ్గరగా పరిశీలించాను. ఏదైనా ఫంక్షన్ జరిగితే, సరదాగా అక్కడ 'ఆచారి'ని ఇమిటేట్ చేసేవాడిని. దాంతో వాళ్లంతా ఆటోలు కట్టించుకుని మరీ వచ్చి ఆచారిని చూసి వెళ్లేవారు.
అలాగే ముకుంద రెడ్డి అనే వ్యక్తి వాయిస్ ను అనుకరించేవాడిని. ఆ వాయిస్ కి తగినట్టుగా బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసుకున్నాను. ఎక్కడ ఆడిషన్స్ కి వెళ్లినా ముకుందరెడ్డినే అనుకరించడంతో అందరికీ కొత్తగా అనిపించింది. అలా ముకుందరెడ్డి నుంచి 'బిత్తిరి సత్తి' వచ్చాడు" అని చెప్పుకొచ్చాడు.