Ox: 15 అంగుళాల ఎత్తు, 22 అంగుళాల పొడవు... నిన్ననే పుట్టిన బుజ్జి దూడ ఇది!
- తూర్పు గోదావరి జిల్లాలో జననం
- చిన్న పెయ్యదూడకు జన్మనిచ్చిన ఆవు
- చూసేందుకు ప్రజల ఆసక్తి
సాధారణంగా అవుకు దూడ పుడితే ఎలా ఉంటుంది? దాదాపు ఒక మీటర్ ఎత్తు, మీటరున్నర పొడవు కచ్చితంగా ఉంటుంది. కానీ, ఇది చాలా ప్రత్యేకమైన దూడ. దీని ఎత్తు కేవలం 15 అంగుళాలు మాత్రమే..ఇక పొడవు 22 అంగుళాలు. పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఇటువంటి అరుదైన దూడ జననం తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు సమీపంలోని గుమ్మిలేరులో జరిగింది. ఈ ఆవు యజమాని ముత్తాల భాస్కరరావు. ఒంగోలు రకానికి చెందిన ఈ ఆవుకు పెయ్యదూడ ఇంత చిన్నగా పుట్టడంతో, చుట్టుపక్కల నుంచి జనం వచ్చి చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.