Omnivision: రికార్డు కెక్కిన సూక్ష్మ.. అత్యాధునిక కెమెరా!
- కేవలం 0.6 ఎంఎం వెడల్పుతో కెమెరా
- తయారుచేసిన ఓమ్నీ విజన్
- గిన్నిస్ రికార్డు కూడా సొంతం
ఈ చిత్రంలో వేలిపై ఉన్న నల్లటి చిన్న వస్తువును చూశారా? ఇది హై ఎండ్ ఫెసిలిటీస్ తో తయారైన కెమెరా. ఇదే ప్రపంచంలోని అతి చిన్న, అత్యాధునిక కెమెరా అట. దీన్ని తయారు చేసింది ఓమ్నీ విజన్.
అంతేకాదు... ఈ కెమెరా గిన్నిస్ రికార్డును కూడా సృష్టించింది. ఇది కేవలం 0.65 మిల్లీమీటర్ల వెడల్పే ఉంటుందట. అంటే, ఒక మిల్లీమీటర్ కన్నా తక్కువే. దీనిపేరు 'ఓవీఎం 6948'. వైద్య రంగంలో డాక్టర్లకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ల సమయంలో ఇది ఉపకరిస్తుందట. అన్నట్టు 120 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ, 200/200 పిక్సెల్స్ రెజల్యూషన్, వెలుతురు తక్కువగా ఉన్నా స్పష్టమైన ఫోటోలను చూపడం దీని ప్రత్యేకతలట.