suresh prabhu: ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ పథకంపై కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు విమర్శలు
- ‘ఆయుష్మాన్ భారత్’తో పేదల ఆరోగ్యానికి భరోసా
- కేంద్రం నిధులతో ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’
- పాండ్రంకిని అభివృద్ధి చేసి చూపిస్తా
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో ఆ పథకాన్ని అమలు చేస్తూ దానికి ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ అని పేరు పెట్టుకుందని విమర్శించారు. విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
తాను దత్తత తీసుకున్న విశాఖపట్టణంలోని పాండ్రంకి గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. పొత్తు అనేదే అవసరం లేని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్న ఆయన, ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని, పేదలను ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని సురేశ్ ప్రభు పేర్కొన్నారు.