LIC: పాలసీ ల్యాప్స్ అయినా పునరుద్ధరించుకోవచ్చు: ఎల్ఐసీ గుడ్ న్యూస్

  • ఆర్థిక పరమైన ఇబ్బందులతో పాలసీని ఆపేసిన వారికి శుభవార్త
  • నాన్ లింక్డ్ పాలసీలకు ఐదేళ్లు
  • యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్లలోపు పునరుద్ధరించుకునే అవకాశం

బీమా పాలసీదారులకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ శుభవార్త చెప్పింది. ఆర్థిక పరమైన కారణాలతో పాలసీని మధ్యలోనే ఆపేసిన వారికి పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పాలసీ ల్యాప్స్ అయి రెండేళ్లు పూర్తయినా దానిని పునరుద్ధరించుకోవచ్చని తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు పాలసీ ల్యాప్స్ అయిన రెండేళ్ల వరకు మాత్రమే దానిని పునరుద్ధరించుకునే అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు దీర్ఘకాలంపాటు పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించింది.

నాన్ లింక్డ్ పాలసీలకు ఐదేళ్లపాటు, యూనిట్ లింక్డ్ పాలసీలకు మూడేళ్లలోపు పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. దీనిని బట్టి 1 జనవరి 2014 కంటే ముందు తీసుకున్న పాలసీలను కూడా పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. పాలసీదారులు తమ బీమాను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ ఆనంద్ తెలిపారు.

  • Loading...

More Telugu News