Apple: 'యాపిల్' ఉదారత... పేదలకు ఇళ్ల కోసం రూ. 17 వేల కోట్ల సాయం!
- కాలిఫోర్నియాలో అవస్థలు పడుతున్న పేదలు
- ఇప్పటికే సాయాన్ని ప్రకటించిన గూగుల్, ఫేస్ బుక్
- అదే దారిలో నడిచిన యాపిల్
అందుబాటు ధరల్లో ఇళ్లు లభించక, తీవ్ర అవస్థలు పడుతున్న పేదల కోసం భూరి విరాళాన్ని అందించేందుకు సాఫ్ట్ వేర్, స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ యాపిల్ ముందుకొచ్చింది. వచ్చే రెండేళ్ల కాలంలో కాలిఫోర్నియాలో పేదలకు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం రూ. 17,692 కోట్లను సాయం చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ స్వయంగా ఓ ప్రకటనలో తెలిపారు. కాలిఫోర్నియాలో నిరాశ్రయులుగా ఉన్న వారిని ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, ఇప్పటికే పేదలకు ఇళ్ల నిర్మాణాల కోసం గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు రూ. 14 వేల కోట్లకు పైగా సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.