Sensex: ఏడు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 53 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 22 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఏడు సెషన్లుగా లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు ఈరోజు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 40,248కి పడింది. నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 11,918 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.38%), యస్ బ్యాంక్ (3.25%), భారతి ఎయిర్ టెల్ (1.84%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.48%), బజాజ్ ఆటో (1.39%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.23%), సన్ ఫార్మా (-2.02%), ఇన్ఫోసిస్ (-1.97%), టాటా స్టీల్ (-1.38%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.21%).