health: కుంగుబాటుకు మంచి మందు.. వ్యాయామం!

  • జన్యుపరమైన మానసిక రుగ్మతలూ దూరం
  • రోజుకి కనీసం 35 నిమిషాల చొప్పున వ్యాయామంతో అద్భుత ఫలితాలు
  • తేల్చిన చెప్పిన మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు 

వ్యాయామ సాధన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతిరోజు వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మానసిక కుంగుబాటును (డిప్రెషన్) దూరం చేసుకునేందుకు కూడా వ్యాయామం అద్భుతంగా పని చేస్తుందని మరోసారి పరిశోధకులు తేల్చారు. అంతేకాదు, వ్యాయామంతో జన్యుపరమైన మానసిక రుగ్మతలను కూడా నిరోధించవచ్చని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు గుర్తించారు.

రోజుకి కనీసం 35 నిమిషాల చొప్పున వారానికి నాలుగు రోజులు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. తమ పరిశోధనలో 8,000 మంది రోగుల జీవనశైలి, వారు తీసుకునే ఆహారంతో పాటు వారి మానసిక స్థితిగతుల వివరాలను పరిశీలించి ఈ విషయాలు తెలిపారు. కుంగుబాటుతో బాధపడే వారు ప్రతిరోజు వ్యాయామం చేస్తే శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని తేల్చారు. 

  • Loading...

More Telugu News