ayodya: అయోధ్య తీర్పు నేపథ్యంలో.. ఢిల్లీ చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!
- బీజేపీ పాలక పక్ష ప్రతినిధులతో కీలక మంతనాలు
- తీర్పు తదనంతర పరిణామాలపై అమిత్‌షాతో సమాలోచనలు
- సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం
కాసేపటిలో అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి అంశంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీ చేరుకున్నారు. తీర్పు అనంతర పరిణామాలపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరపనున్నారు. ఎపెక్స్ కోర్టు తీర్పు ఏదైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఇప్పటికే బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా సహనంతో ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో తీర్పు అనంతర పరిణామాలపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర పార్టీ పెద్దలతో సమాలోచనలు జరుపుతారని సమాచారం. సాయంత్రం అమిత్ షాతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.