Ayodhya: భారత్ మాతాకీ జై... 'అయోధ్య' తీర్పుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
- అయోధ్య భూవివాదంపై సుప్రీం తీర్పు
- చారిత్రాత్మక నిర్ణయం అంటూ ట్వీట్ చేసిన పవన్
- స్వచ్ఛమైన విజ్ఞత అంటూ ప్రశంసలు
దశాబ్దాల తరబడి అటు ప్రభుత్వాలకు, ఇటు న్యాయవ్యవస్థకు చిక్కుముడిలా నిలిచిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు అంతిమతీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. సాంత్వన కలిగించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వచ్ఛమైన విజ్ఞతకు దర్పణం పడుతోందని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ధర్మాన్ని పరిరక్షించేలా తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు భారతీయులుగా తామందరం హృదయపూర్వక సమ్మతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. చివరగా 'భారత్ మాతాకీ జై' నినాదంతో ట్వీట్ ముగించారు.