Ayodhya: అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశముందన్న నిఘా వర్గాలు... అప్రమత్తమైన కేంద్రం
- అయోధ్య తీర్పు వెల్లడి
- జైషే కదలికల్లో వేగం పెరిగిందన్న నిఘా వర్గాలు
- అదను కోసం పొంచి ఉందని కేంద్రానికి సమాచారం
దేశంలో అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అయోధ్య తీర్పు మరికొన్నిరోజుల్లో వెలువడుతుందన్న వార్తలు ప్రారంభమైనప్పటి నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కదలికలు తీవ్రం అయ్యాయని, ఇప్పుడు తీర్పు రావడంతో భారీ దాడులకు పాల్పడేందుకు ఆ ఉగ్ర సంస్థ పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు కేంద్రానికి సమాచారం అందించాయి.
ఉగ్రవాదుల గురి ప్రధానంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై ఉందని, మొత్తానికి అతి పెద్ద విధ్వంసానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు తమకు సమాచారం అందిందని ఓ ఉన్నతస్థాయి అధికారి వెల్లడించారు. తాము ఈ సమాచారాన్ని భద్రతా దళాలతోనూ పంచుకున్నామని తెలిపారు.