Maharashtra: ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన.. అంతా ఓకే అయితే పదవుల పంపకాలు ఇలా ఉండచ్చు!
- ఉద్ధవ్, శరద్ పవార్ ల సమావేశంలో కుదిరిన ఒప్పందం
- ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వనున్న కాంగ్రెస్
- సీఎం - శివసేన; డిప్యూటీ సీఎం - ఎన్సీపీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన అడుగులు వేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శివసేన, ఎన్సీపీల అధినేతలు ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ మధ్య జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో, కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే... పదవుల పంపకాలు ఈ విధంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. బయటి నుంచి మద్దతిచ్చే కాంగ్రెస్ కు స్పీకర్ పదవిని కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.
అంతా సవ్యంగా జరిగి ప్రభుత్వం ఏర్పడితే కీలక పదవుల పంపకాలు ఇలా ఉండొచ్చు:
ముఖ్యమంత్రి - శివసేన
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ - ఎన్సీపీ
స్పీకర్ - కాంగ్రెస్
రెవెన్యూ, అర్బన్ డెవలప్ మెంట్ - శివసేన
హోం శాఖ, ఆర్థిక శాఖ - ఎన్సీపీ
మరోవైపు, తమ మద్దతు కావాలనుకుంటే బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని ఎన్సీపీ కండిషన్ పెట్టింది. ఇంకోవైపు, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి... ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) నేడు అత్యవసరంగా సమావేశం కాబోతోంది.