Amaravathi: అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ వెళ్లిపోవడానికి కారణం ఇదే: ఐవైఆర్ కృష్ణారావు
- ప్రాజెక్ట్ సాధ్యం కాదని సింగపూర్ వాళ్లు ఎప్పుడో గ్రహించారు
- అందుకే జాప్యం చేస్తూ కాలం గడిపారు
- వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వారికి విముక్తిని కలిగించింది
అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్టు సింగపూర్, ఏపీ ప్రభుత్వాలు నిన్న అధికారికంగా ప్రకటించాయి. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వానికి అమరావతి ఆలోచన లేదనే విషయాన్ని గుర్తించామని... అందుకే ప్రాజెక్టు నుంచి వైదిలిగామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. 'సింగపూర్ వారికి ఇది కావలసిన కార్యము గంధర్వులే తీర్చినట్లు అయింది. పర్యావరణ సమస్యల దృష్ట్యా, వరదల ప్రభావం వల్ల ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని వాళ్లు ఎప్పుడో గ్రహించారు. అందుకనే జాప్యం చేస్తూ కాలం గడిపారు. ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం ఒకరకంగా వారికి ప్రాజెక్టు నుంచి విముక్తి కల్పించింది' అంటూ ట్వీట్ చేశారు.