Somu Veerraju: గంటాతో భేటీ అయిన బీజేపీ నేత సోము వీర్రాజు
- గంటా నివాసానికి వెళ్లిన సోము వీర్రాజు
- పలు అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం
- బ్రేక్ ఫాస్ట్ చేసేందుకే వచ్చారన్న గంటా వర్గీయులు
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ తరుణంతో ఈరోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గంటాను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా వీరు చాలాసేపు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇరువురి మధ్య పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు ఈ అంశంపై గంటా వర్గీయులు స్పందించారు. కేవలం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు సోము వీర్రాజు వచ్చారని తెలిపారు.