women: మహిళలూ.. సాయంత్రం 6 తర్వాత అధికంగా తింటున్నారా?.. జాగ్రత్త మరి అంటోన్న పరిశోధకులు
- కొలెస్ట్రాల్ స్థాయులు విపరీతంగా పెరిగే అవకాశం
- గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం
- బీపీ, షుగర్ పెరిగే అవకాశం
సాయంత్రం 6 గంటల తరువాత అధికంగా తినే మహిళలకు గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. సగటున 33 ఏళ్ల వయసున్న 112 మంది మహిళలపై అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. తమ పరిశోధనలో భాగంగా వారు ఆ మహిళల బీపీ, షుగర్ స్థాయిలను ఏడాది పాటు పరిశీలించారు.
ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తరువాత అధిక కేలరీలున్న ఆహారాన్ని అధికంగా తీసుకునే మహిళల్లో కొలెస్ట్రాల్ స్థాయులు విపరీతంగా పెరిగాయి. వారిలో గుండె సంబంధిత జబ్బులతో పాటు బీపీ, షుగర్ పెరిగింది. దీంతో వారికి గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం అధికమని పరిశోధకులు తెలిపారు. సాయంత్రం పూట తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు.