cm: మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చబోతున్నాం: ఏపీ సీఎం జగన్
- ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాం
- విద్యా బోధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం
- ‘మనబడి నాడు-నేడు’ ప్రారంభించిన జగన్
‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చబోతున్నామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. తొలివిడతలో దాదాపు 15,717 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నామని, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.3,500 కోట్లు కేటాయిస్తోన్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు.
నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు అని, వారి భవిష్యత్తును అందంగా, ఆనందమయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. పేదబిడ్డలకూ ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని, పిల్లలు భావి ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో విద్యా బోధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. కాగా, బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో జగన్ ఇవాళ ప్రారంభించారు.