Sunrisers: షకీబల్ హసన్, యూసుఫ్ పఠాన్ లను విడుదల చేసిన సన్ రైజర్స్

  • ఆటగాళ్ల బదిలీలకు ముగిసిన గడువు
  • రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలు వెల్లడి
  • సన్ రైజర్స్ మిగులు నిధులు రూ.17 కోట్లు

ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఈ నెల 14తో ఆటగాళ్ల బదిలీలకు గడువు ముగియడంతో తాము కొనసాగించదలుచుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు వెల్లడించాయి. దాదాపు అన్ని జట్లు ఈసారి భారీగా ఆటగాళ్లను వదిలించుకున్నాయి. కోట్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్లు ఏమాత్రం రాణించకపోవడంతో వారిని కూడా విడుదల చేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కోసం ఐపీఎల్ నయా సీజన్ కోసం సన్నద్ధమవుతోంది.

ఈ క్రమంలో, షకీబల్ హసన్, యూసుఫ్ పఠాన్ వంటి సీనియర్లను కూడా విడుదల చేసింది. వీరిద్దరితో పాటు దీపక్ హుడా, రికీ భుయ్, మార్టిన్ గప్టిల్ లను కూడా రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఖాతాలో మిగులు నిధులు రూ.17 కోట్లు ఉండగా, ఇంకా ఏడుగురు ఆటగాళ్ల అవసరం ఉంది. వారిలో ఇద్దరు విదేశీయులను తీసుకోవచ్చు.

ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టులో కేన్ విలియమ్సన్, వార్నర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, మనీశ్ పాండే, జానీ బెయిర్ స్టో, మహ్మద్ నబీ, సాహా, భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్ లేక్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, నటరాజన్, ఖలీల్ అహ్మద్, శ్రీవత్స్ గోస్వామి, అభిషేక్ శర్మ, బేసిల్ థంపి, సందీప్ శర్మ ఉన్నారు.

  • Loading...

More Telugu News