Warangal Urban District: హన్మకొండ హత్యాచారం కేసులో... ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చిన హైకోర్టు!
- జూన్ 18న చిన్నారిపై హత్యాచారం
- ఆగస్టు 7న ఉరిశిక్ష విధించిన వరంగల్ కోర్టు
- శిక్షను తగ్గించిన హైకోర్టు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హన్మకొండ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. జూన్ 18న 9 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, ఆపై పాపను హత్య చేశాడు. ఈ కేసును విచారించిన వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఉరిశిక్షను విధించింది. కేసు తీర్పు ఆగస్టు 7న వెలువడగా, తనకు విధించిన ఉరిశిక్షను దోషి, హైకోర్టులో సవాల్ చేశాడు. కేసును విచారించిన న్యాయస్థానం, నిందితుడికి విధించిన శిక్షను యావజ్జీవ ఖైదుగా సవరిస్తూ తీర్పిచ్చింది.