Sonia Gandhi: భద్రత కింద సోనియా కుటుంబానికి పదేళ్లనాటి కార్లు.. విమర్శలు

  • సోనియా కుటుంబానికి ఉన్న ఎస్‌పీజీ భద్రతను ఎత్తివేసిన కేంద్రం
  • దాని స్థానంలో జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత
  • బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులు పదేళ్ల క్రితం నాటి వాహనాల కేటాయింపు

సోనియా గాంధీ కుటుంబానికి జడ్‌ ప్లస్ సెక్యూరిటీ కింద పదేళ్ల క్రితం నాటి వాహనాలను కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోనియాగాంధీ కుటుంబానికి ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) సెక్యూరిటీని ఇటీవల ఉపసంహరించిన కేంద్రం తాజాగా వారికి పదేళ్ల క్రితం నాటి వాహనాలను కేటాయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులు 2010 మోడల్ టాటా సఫారీ వాహనాలను కేంద్రం కేటాయించింది.

ఎస్‌పీజీ భద్రతలో సోనియా కుటుంబానికి కమాండో స్థాయి అధికారులు రక్షణగా ఉండేవారు.. ఇప్పుడు జడ్‌ప్లస్ సెక్యూరిటీలో వందమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మాత్రమే రక్షణగా ఉంటారు. సోనియా కుటుంబానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని కోరినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తర్వాత సోనియా కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత కల్పించారు. ఇప్పుడు దానిని తొలగించి జడ్‌ప్లస్ భద్రతను కేటాయించారు.

  • Loading...

More Telugu News