Andhra Pradesh: ఏపీలో ఇంగ్లీషు మీడియం విద్యపై జీవో జారీ
- 1 నుంచి 6 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
- వచ్చే ఏడాది నుంచి అమలు
- ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను తప్పని సరిచేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన వుండేలా మారుస్తూ ఈ మేరకు జీవో జారీ అయింది. 2021-22 నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధన వుండనుంది. కాగా, ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ, హ్యాండ్ బుక్స్ బాధ్యతను ఎన్సీఈఆర్టీకి ప్రభుత్వం అప్పగించింది. భవిష్యత్ లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఆంగ్లంలో ప్రావీణ్యం వున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.