Andhra Pradesh: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎన్నికపై హైకోర్టు విచారణ.. నోటీసుల జారీ

  • ఎన్నికల్లో పోటీ సందర్భంగా చెల్లని కులధ్రువీకరణ పత్రం సమర్పించారని ఆరోపణ
  • ఆమె ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు
  • కొండదొరగా పేర్కొంటూ ఆమె జత చేసిన ధ్రువీకరణ పత్రం చెల్లదంటూ పిటిషన్ 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయనగరం జిల్లా  కురుపాం (ఎస్టీ) నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పుష్ప శ్రీవాణి చెల్లుబాటు కాని కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేశారని, ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. ఆమె చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సింహాచలం, బీజేపీ అభ్యర్థి ఎన్. జయరాజు గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీవాణి కొండదొరగా పేర్కొన్నారని, ఈ మేరకు కులధ్రువీకరణ పత్రం సమర్పించారని పేర్కొన్నారు. అయితే అది చెల్లుబాటు కాదని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు మంత్రి శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News